టీమ్ఇండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్ మూగబోయిందా? మునుపటిలా అతడు జోరు కొనసాగించలేకపోతున్నాడా? అంటే అవునని సగటు క్రీడా అభిమాని ఇట్టే చెప్పేస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ ఫామ్ అలా ఉంది మరి. పరుగుల సంగతి పక్కన బెడితే.. కనీసం క్రీజులో నిలదొక్కుకునేందుకు కూడా రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు తన సారథ్యంలో(Capatancy)నూ మునుపటి చురుకుదనం కనిపియడం లేదు. దీంతో టీమ్ఇండియా(Team India)కు వరుస పరాజయాలు తప్పడం లేదని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా అడిలైడ్ టెస్టు(Adelaide Test)లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 రన్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొటున్నాడు.
ఆస్థాయి ప్రభావం ఎక్కడ?
ప్రస్తుత క్రికెట్లో రోహిత్ శర్మ బెస్ట్ ప్లేయర్(Best player) అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్లకు అతీతంగా అతడు అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్(Limited Overs Cricket)లో టాప్ బ్యాటర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న హిట్‌మ్యాన్(HitMan).. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. 6, 3, 11, 18, 8, 0, 52, 2, 8, 23, 5, 6.. గత 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. ఇందులో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. సెంచరీ(Century) ప్రస్తావన కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అతడి బ్యాటింగ్ వైఫల్యమే కారణం
బ్యాటర్‌గా రోహిత్ రాణిస్తే.. టీమ్‌లోని ఇతర ఆటగాళ్లు కూడా తాము మరింత బాధ్యతతో ఆడాలని భావిస్తారు. తాను పరుగులు చేయడం ద్వారా ఇతర ప్లేయర్లకు హిట్‌మ్యాన్ ఉదాహరణగా నిలవాలి. కానీ అతడి బ్యాటే(Bat) మూగబోతుంటే.. ఇంక మిగతా వారి సంగతి చెప్పనక్కర్లేదు. రోహిత్ త్వరగా ఔట్ అవడం వల్ల మిడిలార్డర్ బ్యాటర్లపై ప్రెజర్(Pressure) పడుతోంది. దీని వల్ల జట్టు భారీ స్కోర్లు సాధించలేకపోతోంది. తాజా అడిలైడ్ టెస్ట్‌తో పాటు న్యూజిలాండ్ సిరీస్(New Zealand series)లో టీమిండియా ఓడిపోవడానికి అతడి బ్యాటింగ్ వైఫల్యం ఒక కారణమనే చెప్పాలి. మరోవైపు టెస్టులకు రోహిత్ సెట్ అవ్వడని.. లాంగ్ ఫార్మాట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
India removed Rahane and Pujara for the low scores and this guy is performing worst than them and he is still playing.
The most protected captain and player of India #RohitSharma #AUSvIND pic.twitter.com/nnZC2OtMZo
— Dev (@ZenithDev07) December 7, 2024








