తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly meetings) సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. కాగా దీనిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో ముందుగానే సిద్ధం అయ్యాయి. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. కాగా డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాగా ఈ విగ్రహ రూపం మార్చడంపై కాంట్రావర్సీ నెలకొంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో వివరణ ఇచ్చారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా
భవిష్యత్లో ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగా తల్లి విగ్రహం మార్చుకుండా ఉండేలా చూస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)అన్నారు. తెలంగాణ తల్లి స్వరూపం అనేక రూపాల్లో ఉన్నాయని అన్నారు. తెలంగాణ తల్లి (Telangana Thalli statue) ప్రతి రూపాన్ని రూపకల్పన చేసి సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని చారిత్రక, సంస్కృతికి అద్దం పడుతూ కంటే, హారంతో, కాళ్ళకు మెట్టెలతో, పచ్చని చీరతో, మన పంటలకు చిహ్నంగా రూపొందించామన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భట్టి విక్రమార్క తెలిపారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. ప్రతి ఏడాది 9వ తేదీని తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింని భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మార్పు అంటే ఇదేనా
ఇప్పటికే తెలంగాణ తల్లి (Telangana Thalli statue) విగ్రహం మార్పును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికైనా మూర్ఖపు ఆలోచనలను విరమించుకోవాలని సూచిస్తుంది. మార్పు చేయడం అంటే విగ్రహాలను మార్చుకోవడం కాదని హితవు పలికింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వల్లే తెలంగాణ మసకబారుతోందని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.






