సంధ్య థియేటర్​ ఘటన.. అల్లు అర్జున్ అరెస్టు

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఆయన ఇంటికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసు అధికారులు ఆయణ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఈ నెల 4న పుష్ప 2 (Pushpa 2 Movie) సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా నగరంలోని సంధ్య థియేటర్​లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

అయితే ఈ క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను తీసుకెళ్లడంలో తప్పు లేదని అన్న ఆయన.. పోలీసులు మరీ బెడ్‌రూమ్‌ వరకు వస్తారా? అని ఫైర్ అయ్యారు. దుస్తులు కూడా మార్చుకోనివ్వరా? అంటూ ధ్వజమెత్తారు. ఇలా చేయడం సబబు కాదని పేర్కొన్నారు. బన్నీ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్​ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు.

అల్లు అరవింద్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లగా శిరీష్ (Allu Sireesh) కారులోనే పోలీస్ స్టేషన్ ముందు వేచి ఉన్నారు. ఠాణా వద్దకు ఐకాన్ స్టార్ అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు అల్లు అర్జున్ పిటిషన్​ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి హైకోర్టు (Telangana HC)ను ఆశ్రయించారు. బుధవారం రోజున పిటిషన్‌ వేశామని కోర్టు దృష్టికి తీసుకురాగా.. అత్యవసర పిటిషన్‌ను ఉదయం ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికి తెచ్చామని అల్లు అర్జున్ లాయర్‌ కోర్టుకు వివరించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *