ఓటీటీలోకి పుష్ప 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ పుష్ఫ 2. బాహుబలి 2, కేజీఎఫ్ 2 తర్వాత యావత్ దేశం ఇంతలా ఎదురుచూసిన చిత్రం పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తొలి వారంలోనే దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన చిత్రంగా నిలిచింది.

250 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు?
ఈ భారీ పాన్ ఇండియా (National Award Winner) మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. భారత్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోగా మొత్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

జనవరి 9 నుంచి స్ట్రీమింగ్
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) కానీ, నెట్‌ఫ్లిక్స్ (Netflix) కానీ ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. పుష్ప ది రైజ్‌కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ హక్కులను సంపాదించింది. అప్పట్లోనే రూ. 30 కోట్లు ఖర్చు చేసిందని టాక్. పుష్ప 1 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప 2 డిజిటల్ హక్కుల కోసం అమెజాన్‌ (Amazon Prime) నెట్‌ఫ్లిక్స్ మధ్య పోటీ నెలకొంది. దీంతో కళ్లు చెదిరే మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ పుష్ఫ 2 ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్ . సాధారణంగా థియేటర్‌లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. పుష్ప 2 క్రేజ్ , మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రెండు , మూడు నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేసింది. జనవరి 9 నుంచి పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతుందని తెలిపినట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *