Mana Enadu : గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో (Gabba Test) వరుణుడు దోబూచులాడుతున్నాడు. (Ind vs Aus) ఈ టెస్టుకు మొదటి నుంచి ఆటంకం కలిగిస్తున్న వర్షం.. మూడో రోజు ఏకంగా ఆరు సార్లు అడ్డుతగలగా, నాలుగో రోజు కూడా సవ్యంగా సాగనివ్వలేదు. ఇన్నింగ్స్ ప్రారంభం తర్వాత, టీ బ్రేక్ సమయానికి కూడా వర్షం అడ్డుతగిలింది. (Border Gavaskar Trophy) 51 ఓవర్ తర్వాత ఎంపైర్లు ఆటను నిలిపివేశారు. కొద్దిసేపు వాన కురవడంతో గ్రౌండ్ సిబ్బంది నీటిని తొలగించగా.. చాలా సేపటి తర్వాత నాలుగో సెషన్ ప్రారంభమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు వర్షం ఓరకంగా మంచే చేస్తోంది.
దంచికొట్టిన ఆసీస్ బ్యాటర్లు
పెర్త్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచికొడితే.. అదే పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మ (Rohit sharma), విరాట్ కోహ్లీ (Virat kohli) లాంటి స్టార్ బ్యాటర్లు కొద్దిసేపు కూడ్రా క్రీజులో నిలవలేకపోయారు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు క్రీజు వదిలి పెవిలియన్ చేరారు. రోహిత్ 10 రన్స్ మత్రమే చేయగా, కోహ్లీ 3 పరుగులకే కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. మొదటి టెస్టులో సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ సైతం విఫలమయ్యాడు. కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. శుభ్‌మన్ గిల్ (1), కీపర్ రిషభ్ పంత్ (9) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు.
ఒకే ఒక్కడు కేఎల్.. తోడుగా జడేజా
ఓవైపు వికెట్లు కూలుతున్నా కేఎల్ రాహుల్ (KL Rahul) ఒక్కడే పట్టుదల ప్రదర్శించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ క్రీజులో నిలిచాడు. ఆసీస్ విధించిన 445 భారీ స్కోరు ముందుండగా సహనంతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆకట్టుకున్నాడు. రోహిత్ ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన జడేజాతో జట్టుకట్టి ఇన్నింగ్స్ నడిపించాడు. 84 రన్స్ చేసి లయన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా సైతం ఆకట్టుకుంటున్నాడు. 60 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.








