Mana Enadu : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 13,735 క్లర్క్ (SBI Clerk Notification) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబరు 17వ (మంగళవారం) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొంది.
ఎస్బీఐ క్లర్క్ పోస్టు అర్హతలు
ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులకు డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బీఐ (https://sbi.co.in/) తన వెబ్ సైట్లో పొందుపరిచింది. 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులను తెలిపింది. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుందని పేర్కొంది.
SBI జూనియర్ అసోసియేట్ క్లర్క్ నోటిఫికేషన్ 2024 వివరాలు ఇవే..
- పోస్టులు : క్లర్క్ (జూనియర్ అసోసియేట్)
- పోస్టుల సంఖ్య – 13,735 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ – 50, తెలంగాణ – 342)
- దరఖాస్తు విధానం : ఆన్లైన్
- దరఖాస్తు గడువు : 2024 డిసెంబర్ 17 టు 2025 జనవరి 7
- అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
- వయో పరిమితి : 20 – 28 ఏళ్ల మద్య ఉండాలి
- ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష మీద పరీక్ష ఆధారంగా ఎంపిక






