Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్య మృతి

‘బలగం’ సినిమాలో పాటపాడి నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) (Balagam Mogilaiah) మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో జబర్దస్థ్​ వేణు తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) సినిమా విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో (Mogilaiah) మొగిలయ్య ఓ భావోద్వేగభరితమైన పాట పాడి హృదయాలను హత్తుకున్నారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *