హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh)తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12న వివాహం చేసుకుంది. గోవాలో గ్రాండ్‌గా జరిగిన వీరి పెళ్లి వేడుకకు (Keerthy Suresh wedding) కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పెళ్లికి తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) సైతం హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. తన డ్రీమ్ ఐకాన్ వచ్చి ఆశీర్వదించారంటూ ఆనందం వ్యక్తం చేసింది.
తమిళ సంప్రదాయం ప్రకారం తెల్లు చొక్కా, లుంగీ ధరించి వేడుకకు వచ్చిన విజయ్ ( Vijay).. కొత్త జంటను ఆశీర్వదించి ఫొటో దిగారు. ఈ ఫొటోలను కీర్తి సరేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ‘మా డ్రీమ్ ఐకాన్ మా పెళ్లికి వచ్చి ఆశీర్వదించిన క్షణాలు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కీర్తి సురేశ్, ఆంటోనీ తట్టిల్ (Keerthy Suresh and antony) దాదాపు 15 ఏళ్లుగా స్నేహితులు. కొంత కాలంగా వీరు ప్రేమలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కీర్తి అధికారికంగా చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని వెల్లడించింది. ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైతోపాటు విదేశాల్లోనూ ఆయనకు వ్యాపారాలున్నాయి. స్కూల్ రోజుల నుంచే కీర్తికి, ఆంటోనీకి పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
View this post on Instagram






