TS SSC: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ(Telangana)లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌(10th Class Board Exam Schedule) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి(March) 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఏప్రిల్(April) 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

పూర్తి షెడ్యూల్ ఇదే

☛ 2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్(First Language)
☛ 2025 మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్(Second Language)
☛ 2025 మార్చి 24న ఇంగ్లిష్(Third Language ,English)
☛ 2025 మార్చి 26న మ్యాథ్స్(Mathematics)
☛ 2025 మార్చి 28న ఫిజికల్ సైన్స్(Science Part-I Physical Science)
☛ 2025 మార్చి 29న బయోలాజికల్ సైన్స్(Science Part-II Biological Science)
☛ 2025 ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్(Social Studies)

పదో తరగతి పరీక్షలు(SSC Exams) గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2025-26 నుంచి వార్షిక పరీక్షలు 100 Marksకు జరుగుతాయి. ఈ నిబంధన(Rule)లో మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే మార్కులు 80% మార్కులకు జరగనుండగా 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్(Practical Exams) నుంచి కలపనున్నారు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు(Results) మార్కుల రూపంలో వెల్లడించనున్నారు. గతంలో గ్రేడింగ్(Grading) రూపంలో ఇస్తున్న ఫలితాలను ఎత్తివేస్తూ మార్కులను ప్రకటించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ G.O జారీ చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పరీక్షా విధానంలోనూ మార్పులను తీసుకురానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేశారు. కాగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *