మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో పర్యటించదని బీసీసీఐ(Board of Control for Cricket in India) తేల్చి చెప్పింది.
అయితే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహిస్తే (Hybrid model) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని భారత్ చెప్పింది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నట్లు ICC అఫీషియల్‌గా ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్ల(ICC Eventsలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదిక(A Neutral Platform)లపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.
2028 T20 వరల్డ్ కప్‌కి పాక్ ఆతిథ్యం
గత కొన్ని రోజులుగా BCCI, PCBలతో ICC చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో జరిపేందుకు అంగీకరించాయి. అయితే 2024-27 మధ్య జరిగే ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచులన్నీ తటస్థ వేదికల్లోనే నిర్వహిస్తారు. 2025 ఉమెన్స్ వరల్డ్ కప్(Womens WC), 2026లో మెన్స్ T20 వరల్డ్ కప్ భారత్‌లో జరగనుంది. ఈ రెండు ఈవెంట్లకు పాక్ జట్టు భారత్‌కు రాదు. వీటిని ఇతర దేశాలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను తర్వలోనే ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. మరోవైపు 2028 T20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్థాన్(Pakistan) దక్కించుకుంది.
The ICC likely to propose a Hybrid Model for the "Champions Trophy 2025" in #INDvsPAK #IccChampionsTrophy #championstrophy2025 #ChampionsTrophy #PAKvsSA pic.twitter.com/Kbm0sVDd0Y
— Neha (@NehaSinghz) December 19, 2024








