కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అంటే విభిన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రా, ఉపేంద్ర, ఏ వంటి సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ గత పదేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వీయ దరర్శకత్వంలో ‘యుఐ’ అనే సినిమాను తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ;లహరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ నుండి అందుతున్న టాక్ ఎలా ఉందంటే
Elon Musk changed the like button for #UiTheMovie on X for Blastttt 😍🔥
#UiTheMovieOnDEC20th #UITheMovieFromDec20 #Upendra #Kannada pic.twitter.com/feDBrTJICK
— 𝙈𝘼𝙉𝙊𝙅 🌠 (@07kmanojkumar) December 20, 2024
ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది. ‘యూ అండ్ ఐ’, ‘పగలు, రాత్రి’ సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది. హీరోగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడని ఆడియెన్స్ అంటున్నారు. డైరెక్టర్ గాను ఉప్పి తన డిఫరెంట్ టేకింగ్ తో వింటేజ్ ఉపేంద్రని చూపించాడు అంటున్నారు.
థియేటర్ లో ఫస్ట్ డిస్క్లైమర్ మాత్రం ‘మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్ళండి’ అంటూ వేశారు క్లాసిక్ ఉపేంద్ర. మరోవైపు అతికొందరు మాత్రం మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒరిజినల్ రివ్యూ రావడానికి మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో తెరకెక్కి సినిమాలు చాలా అరుదు, ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు. కాబట్టి ‘యూఐ’ మూవీ ఈజ్ ఏ మస్ట్ ట్రై.






