Mana Enadu : ఈ ఏడాది ‘అమరన్ (Amaran Movie)’ సినిమాలో నటనకు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి బెస్ట్ మార్క్స్ పడ్డాయి. ఈ చిత్రంలో పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులే కాదు విమర్శకులూ ఫిదా అయ్యారు. ప్రతి ఎమోషన్ ను చాలా చక్కగా పండించిందంటూ ప్రశంసలు కురిపించారు. అందుకే ఈ సినిమాలో ఆమె నటనకు అవార్డులు కూడా వరుస కట్టాయి. తాజాగా అమరన్ చిత్రంలో నటనకు గానూ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Chennai International Film Festival 2024) లో సాయిపల్లవికి ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఇక బెస్ట్ యాక్టర్ గా మహారాజ మూవీకి విజయ్ సేతుపతి ఈ పురస్కారం అందుకున్నారు.
బెస్ట్ ఫిల్మ్ గా ‘అమరన్’
కోలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకగా గురువారం రోజున గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఇందులో భాగంగా శివ కార్తికేయన్, సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన అమరన్ మూవీ ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది. ఇదే సినిమాకు సాయి పల్లవికి ఉత్తమ నటిగా.. ‘మహారాజ (Maharaja)’ మూవీకి గానూ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది.
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 అవార్డు విన్నర్స్ వీరే:
- ఉత్తమ చిత్రం: అమరన్
- రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
- ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజ)
- ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)
- ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
- ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై)
- ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
- ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్ (వేట్టయన్)
- ఉత్తమ రచయిత: నిథిలన్ సామినాథన్ (మహారాజ)
- ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ (అమరన్)
- స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)






