Mana Enadu : అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) యూజర్లకు అలర్ట్. చాలా మంది యూజర్లు ఒక అకౌంట్ తీసుకుని తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి యూజర్లకు ఈ సంస్థ షాక్ ఇచ్చింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు సంబంధించి తన టర్మ్స్‌లో సవరణలు చేసింది. డివైజ్‌ల వాడకంపై పరిమితి విధించింది.
టీవీలపై లిమిట్
ప్రస్తుతం ప్రైమ్ వీడియో యూజర్లు (Prime Video Users) ఐదు డివైజులను ఒకేసారి వాడుకునే సౌకర్యం ఉంది. ఈ డివైజుల సంఖ్యను అలాగే ఉంచిన అమెజాన్ .. తాజాగా టీవీల సంఖ్యపై పరిమితి విధించింది. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలా వాడాల్సివస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాలని వెల్లడించింది. జనవరి నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు యూజర్లకు ఇ-మెయిల్స్ పంపిస్తోంది.
విత్ యాడ్స్.. విత్ ఔట్ యాడ్స్
ఇక.. ప్రస్తుతం అమెజాన్ ఏడాది మెంబర్షిప్ (Amazon Prime Membership) ధర రూ.1499గా ఉన్న విషయం తెలిసిందే. ఆరు నెలలకు రూ.599.. నెలకు రూ.299 చెల్లించాల్సి వస్తోంది. ఈ మెంబర్‌షిప్‌తో ఎలాంటి యాడ్స్ లేకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడొచ్చు. ఏడాదికి రూ.799 చెల్లించి ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది.. అయితే ఇందులో యాడ్స్ వస్తాయి.






