Mana Enadu : మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai).. బీటౌన్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలు తెలిసి ఐష్ అభిమానులు చాలా నిరాశ చెందారు. ఇక ఈ వ్యవహారంలో బచ్చన్ ఫ్యామిలీ పై ఐష్ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇలా విడాకుల పుకార్లు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అందరికీ ఐశ్వర్య-అభిషేక్ (Abhishek Bachchan) షాక్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. చేతిలోనే చెయ్యేసి కనిపిస్తూ విడాకుల పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
చేతిలోన చెయ్యేసి ఐష్-అభి
తమ కుమార్తె ఆరాధ్య కోసం అభిషేక్-ఐశ్వర్య (Aishwarya Abhishek Bachchan) తాజాగా జంటగా కనిపించారు. గురువారం సాయంత్రం ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆనివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ కు ఐశ్వర్య తన భర్త అభిషేక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్ హాయిగా నవ్వుతూ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారని తాజా ఫొటోలు క్లారిటీ ఇస్తున్నాయి.
View this post on Instagram
పుకార్లు ఇలా ప్రారంభమయ్యాయి..
బచ్చన్ ఫ్యామిలీలో కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయని పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్ల (Aishwarya Abhishek Divorce News)కు బలం చేకూరుస్తూ.. ఈ ఏడాది ప్రారంభంలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్యతో ఒంటరిగా రాగా.. అభిషేక్ తన కుటుంబంతో కలిసి వేర్వేరుగా వచ్చారు. దీంతో వీరిద్దరు విడివిడిగా ఉంటారన్నా వార్తలకు బలం చేకూరింది. ఈ క్రమంలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి.
వేర్వేరు కార్లలో వేడుకకు
ఇక తాజాగా అంబానీ స్కూల్ ఈవెంట్ (Ambani School Event News) లో ఈ జంట కలిసి కనిపించింది. తమ కుమార్తె ఆరాధ్య పర్ఫామెన్స్ ను ఈ జంట కలిసి వీక్షిస్తూ సరదాగా గడిపారు. ఈవెంట్ ఎంట్రీ సమయంలో.. ఎగ్జిట్ సమయంలోనూ ఈ జంట కలిసే ఉంది. అయితే ఈ వేడుకకు ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరు కార్లలో రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. అభిషేక్ బచ్చన్ తన వెడ్డింగ్ రింగ్‌ను చూపిస్తూ.. క్షమించండి.. నేనిప్పటికీ పెళ్లి చేసుకునే ఉన్నా.. అంటూ రిప్లై ఇచ్చి విడాకుల రూమర్లకు చెక్ పెట్టేసిన సంగతి తెలిసిందే.






