Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో పాన్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చెర్రీ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ అనే చిత్రం చేస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు సంక్రాంతికి రాబోతోంది. ఇక త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ షురూ కానున్నాయి. డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?
డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
డల్లాస్ లో ఇవాళ (డిసెంబరు 20న ) జరగనున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) పుష్ప-2తో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. ఆయనతో పాటు చిత్రబృందం కూడా అక్కడికి వెళ్లింది. మరోవైపు ఇటీవలే లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన చిత్రబృందం త్వరలో చెన్నైలోనూ ప్రమోషన్స్ షురూ చేయనుంది.
అబ్బాయ్ కోసం బాబాయ్
జనవరి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లో బిజీబిజీ కానున్నార ట మేకర్స్. జనవరి 4వ తేదీన ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజ్ తెలిపారు. ఈ ఈవెంటులో అబ్బాయ్ రామ్ చరణ్ కోసం.. బాబాయ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Game Changer) సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒకే స్టేజీ పైన పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ను చూసేందుకు చాలా ఉత్సహంగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు అంటున్నారు.
సంక్రాంతికి వస్తున్న చెర్రీ
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ (Kiara Advani) ఫీ మేల్ లీడ్ గా చేస్తోంది. ఎస్ జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.






