U19 Women’s T20 Asia Cup: ఫైనల్లో భారత్.. సెమీస్‌లో శ్రీలంకపై గెలుపు

భారత మహిళలు అదరగొట్టారు. అండర్-19 ఉమెన్స్ ఆసియా కప్‌ టీ20 టోర్నీ(Under-19 Women’s T20 Asia Cup 2024)లో యంగ్ ఇండియా(India) ఫైనల్‌(Final)కు దూసుకెళ్లింది. శుక్రవారం (డిసెంబర్ 20న) జరిగిన సెమీస్‌లో శ్రీలంక(Srilanka)ను మరో 31 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి చిత్తు చేసింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లలో 98/9 రన్స్ చేశారు. ఆ జట్టు బ్యాటర్లలో నిసంసల 21, కెప్టెన్ నానయక్కరా 33 రన్స్ చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆయూషీ శుక్లా 4, పర్ణికా సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది ఓపెనర్ ఈశ్వరి అవ్సరే డకౌట్ అయింది. మరో ఓపెనర్ కమలిని(Kamalini) 28 రన్స్ చేయగా. గొంగడి త్రిష(Gongadi Trisha) 32, మిథిలా వినోద్ 19 రన్స్ చేసి భారత(India) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బౌలర్లలో ప్రభోద 3, గిమ్హాని 2 వికెట్లు తీసింది. భారత బౌలింగ్‌లో అదరగొట్టిన ఆయూషి శుక్లాకు ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. కాగా ఆదివారం (డిసెంబర్ 22న) జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌(Bangladesh)తో భారత్ తలపడనుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *