Mana Enadu : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫ్లవర్.. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తగ్గేదేలే’ అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ పాత్రలో నటించిన ‘పుష్ప 2 : ది రూల్ ‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పాత రికార్డులన్నీ బద్ధలు కొట్టేస్తోంది. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత రప్ఫాడించేస్తోంది.
పుష్పరాజ్ నయా రికార్డు
కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ పుష్పరాజ్ రప్పారప్పా కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. తాజాగా పుష్ప-2 సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. రూ.632 కోట్లు కలెక్ట్ (Pushpa 2 Hindi Collections) చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం పుష్పరాజ్ సాధించిన మరో ఘనత. ఇక ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్) (Pushpa 2 World Wide Collections) వసూలు చేసింది. విడుదలైన 6 రోజుల్లోనే పుష్ప-2 మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో నయా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
జాతర సీక్వెన్సుతో పూనకాలు
ఇక పుష్ప-2 (Pushpa 2 : The Rule) సినిమా సంగతికి వస్తే అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ గా కనిపించింది. ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ లో శ్రీలీల (Sreeleela Pushpa 2) సందడి చేసింది. ఇక ఈ చిత్రంలో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నటనకు మరో నేషనల్ అవార్డు పక్కా అని ఫ్యాన్స్ తో పాటు ఈ మూవీ చూసిన పలువురు ప్రముఖులు కూడా అంటున్నారు.






