Mana Enadu : ఆర్య, ఆర్య-2 సినిమాలతో అల్లు అర్జున్ (Allu Arjun) కు తన కెరీర్ లోనే సూపర్ హిట్స్ ఇచ్చి.. పుష్ప, పుష్ప-2 (Pushpa 2)లతో ఆయణ్ను ఐకాన్ స్టార్ చేయడమే గాక పాన్ ఇండియా స్టార్ ను చేశాడు సుకుమార్. ఇక ‘రంగస్థలం’తో రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ ఇచ్చి.. ‘నాన్నకు ప్రేమ’తో ఎన్టీఆర్ (NTR) కు బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు. ‘1-నేనొక్కడినే’ అంటూ మహేశ్ బాబు (Mahesh Babu)కు టాలీవుడ్ లో అదిరిపోయే సినిమాను అందించాడు. అలా వరుస హిట్లతో టాలీవుడ్ హీరోలకు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చి వారి కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ సినిమాలు వదిలేస్తున్నాడా..?
సినిమాలు వదిలేస్తా
‘నేను సినిమాలు వదిలేస్తా’.. ఈ మాట సాక్షాత్తు డైరెక్టర్ సుకుమార్ (Sukumar) అంటున్నాడు. పుష్ప-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుక్కు సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని నెటిజన్లు తెగ బుర్ర గోకేసుకుంటున్నారు. అయితే ఇది నిజమే అయినా.. సుకుమార్ ఇప్పటికిప్పుడే సినిమాలు వదిలేస్తాను అని చెప్పలేదు. తాజాగా ఆయన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ మూవీ కోసం అమెరికా డల్లాస్ లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ కు గెస్టుగా వెళ్లారు. అక్కడ రిపోర్టర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సుక్కు ఇలా అన్నాడు. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే..?
Papam ra SUKKU 😢
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024
సుక్కూ ఆన్సర్ తో షాకైన చెర్రీ
రామ్ చరణ్-శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల డల్లాస్ నిర్వహించిన ఈవెంట్ (Game Changer Dallas Event)కు సుకుమార్ గెస్టుగా రాగా.. యాంకర్ సుమ ఆయణ్ను ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. ‘సుకుమార్ గారూ మీరు ‘డోప్’ అని ఈరోజుతో ఏదైనా ఒకటి వదిలేయాలనుకుంటే ఏం వదిలేస్తారు?’ అంటూ అడగ్గా.. సెకన్ కూడా ఆలోచించకుండా ‘సినిమా‘ అంటూ సుక్కూ సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానంతో పక్కనే ఉన్న చెర్రీతో పాటు అందరూ షాక్ అయ్యారు. వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకొని ’10 ఏళ్లుగా ఇలానే భయపెట్టిస్తున్నారండి.. అలా ఏం జరగదు’ అని చెప్పుకొచ్చారు.






