అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మిగిలిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మ్యాచ్ల కోసం బీసీసీఐ (BCCI) ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. ఇందుకోసం దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆల్రౌండర్ తనుష్ కోటియన్ను (Tanush Kotian) సెలక్టర్లు ఎంపిక చేశారు. మంగళవారం ఆస్ట్రేలియాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉండాలని సెలక్టర్లు అతడికి చెప్పినట్లు సమాచారం.
26 ఏళ్ల కోటియన్ భారత్-ఎ జట్టు సభ్యుడిగా గత నెలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశానికి వచ్చిన తనుష్.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియా బయల్దేరనున్న కోటియన్.. మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 4వ టెస్టుతో పాటు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టుకు భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.
ఆఫ్ స్పిన్నర్ అయిన 26 ఏళ్ల తనుష్ కోటియన్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతోనే అతడికి బీసీసీఐ నుంచి పిలుపువచ్చినట్లు తెలుస్తోంది. 2023- 2024 రంజీ ట్రోఫీ సీజన్లో కోటియన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్లలో 29 వికెట్ల పడగొట్టాడు. మొత్తం 502 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టౌర్నమెంట్ అవార్డు సైతం అందుకున్నాడు.
🚨 NEWS 🚨
Border-Gavaskar Trophy: Tanush Kotian added to India’s Test squad. #TeamIndia | #AUSvIND
More Details 🔽
— BCCI (@BCCI) December 23, 2024








