Allu Arjun: అల్లు అర్జున్​ వివాదంపై జానీ మాస్టర్​ ఏమన్నారంటే?

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun​ వివాదం హాట్​ టాపిక్​. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట (Sandhya Theater Stampede) తర్వాత అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ సంచలనంగా మారింది. బెయిల్‌ మీద ఉన్న బన్నీ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​ సైతం అరెస్టయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బన్నీ వివాదంపై స్పందించాలని జానీ మాస్టర్‌ను (Jani Master) మీడియా కోరింది. దీంతో ఆయన నేనే ఒక ముద్దాయిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ‘ఈ విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నేనే ఒక ముద్దాయిని. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్‌ కాదు. న్యాయస్థానంపై, నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి’ అని అన్నారు.

జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని మాస్టర్‌ సమాధానమిచ్చారు. ‘గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా పరిశ్రమలో నా గుర్తింపు, గౌరవం ఎప్పటిలాగే ఉంది’ అని పేర్కొన్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *