ఫ్యాన్స్ కు క్రిస్మస్ గిఫ్ట్.. నేడే ‘సూర్య 44’ టైటిల్ టీజర్

ManaEnadu :  కోలీవుడ్ హీరో సూర్య (Suriya)కు ‘ఆకాశమే హద్దు’, ‘జై భీమ్’ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘కంగువా (Kanguva)’ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఒక్క గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు లైనప్ లో ఉంచాడు. అందులో ఒకటి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. సూర్య44 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

ఫ్యాన్స్ కు సూర్య క్రిస్మస్ ట్రీట్

సూర్య తన అభిమానులకు క్రిస్మస్ కానుక ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ (Suriya 44 Update) ను క్రిస్మస్ రోజు (డిసెంబరు 25వతేదీ)న ప్రకటించనున్నారు. బుధవారం రోజున ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ లుక్ షేర్ చేశారు.

సూర్య 44 టైటిల్ టీజర్

ఈ పోస్టర్ లో సముద్రతీరాన ఓ బెంచ్‌పై పూజా హెగ్డే (Pooja Hegde) కూర్చొని ఉండగా.. పక్కనే సముద్రంలోకి గులకరాళ్లు విసురుతూ సూర్య కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.  సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్ లవ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.

స్పెషల్ సాంగ్ లో శ్రియా శరణ్

ఇక ఈ సినిమాలో శ్రియా శరణ్ (Shriya Saran) స్పెషల్ సాంగ్ ఉండనుందని మేకర్స్ తెలిపారు. గోవాలో ఈ పాట కోసం స్పెషల్ సెట్ వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ లవ్ స్టోరీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా సూర్య లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్ తో రోలెక్స్ మూవీ, సుధా కొంగరతో మరో చిత్రానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *