సంక్రాంతికి వస్తున్నాం థర్డ్‌ సింగిల్ క్రేజీ వీడియో

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh)‌ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన గోదారిగట్టు మీద రామచిలకవే, మీను పాటలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా మూడో సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది.

మూడోపాటను ఏదైనా ఎక్స్‌ట్రాఆర్డినరీ వాయిస్‌తో ట్రై చేయాలని అనిల్ రావిపూడి అంటుంటే.. ఆ పాటను వెంకీ నేను పాడతా.. నేను పాడతానంటున్నాడు. వెంకీ చేష్టలతో విసుగొచ్చిన అనిల్‌ రావిపూడి సాంగ్‌ను వెంకీతో పాడించండి అని చెబుతున్నాడు. ఊరమాస్‌ బీట్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఉండబోతుందని సింపుల్ ట్రాక్ చెప్పకనే చెబుతోంది.

ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *