ఉపాధి హామీ, ఆధార్ కార్డ్, తెలంగాణ ఆవిర్భావం.. ఇవన్నీ మన్మోహన్ హయాంలోనే

Mana Enadu : తెల్లని గడ్డం.. నీలం రంగు తలపాగా.. తెల్లని చొక్క.. జేబులో పెన్ను.. చూడటానికి కాస్త నెమ్మదైన మనిషే. కానీ ఆలోచనలు పాదరసం లాంటివి. విధానాలు మాత్రం చాలా దూకుడుగా ఉండేవి. భారతదేశానికి ప్రధానిగా పదేళ్లపాటు పనిచేసి దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) అతి సాధారణ ఆహార్యం ఇది.  2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ 2014 వరకూ కొనసాగారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు, సంచలన సంస్కరణలు తీసుకొచ్చారు.

మన్మోహన్ హయాంలోనే ఎన్ఐఏ అవతరణ 

మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ పథకం, ఆధార్ కార్డుల జారీ (Aadhar Cards). తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం వంటి కీలక పరిణామాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే..  దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్‌ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు తీసుకొచ్చారు ఆయన. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది.

3 కోట్ల మంది రైతులకు రుణమాఫీ 

భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి.. ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం (Compensation), పునరావాసం అందించేలా ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ చర్యలు తీసుకున్నారు. దేశంలో 3 కోట్లమంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ (Runa Mafi) చేసిన ఘనత మన్మోహన్‌ సింగ్ ది.  ఆయన హయాంలోనే విదర్భ, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.

తెలంగాణ బిల్లును గట్టెక్కించారు

తన మైనార్టీ సర్కార్ కు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నా వెనకడుగేయకుండా అమెరికాతో అణు ఒప్పందం ( US-India Nuclear Agreement) చేసుకున్నారు.  తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మన్మోహన్‌ ఆమోద ముద్ర వేయించిన మన్మోహన్ సింగ్.. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లునూ ఉభయసభల్లో గట్టెక్కించారు. జీఎస్‌టీ (GST) విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి.. రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (National Rural Health Mission)ను ప్రారంభించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *