
Mana Enadu : దర్శకధీరుడు, స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ సినిమాకు ప్రపంచ సినీ వేదికపై ఎంతటి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ స్టార్స్ గా పేరు తీసుకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt), బీ టౌన్ స్టార్ అజయ్ దేవగణ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక వసూళ్లలో ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
థియేటర్లో సూపర్ రెస్పాన్స్
అయితే ఇంతటి భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాపై జక్కన్న టీమ్ డాక్యుమెంటరీ రూపొందించింది. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ (RRR Behind And Beyond) డాక్యుమెంటరీని డిసెంబరు 20వ తేదీన థియేటర్లలో విడుదల చేసింది. గంట 37 నిమిషాల రన్‌టైంతో సాగే ఈ డాక్యుమెంటరీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది ఈ జక్కన్న చెక్కిన శిల్పం.
Behind the scenes, beyond the legacy.
Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/pdN10lCtN5— Netflix India (@NetflixIndia) December 26, 2024
నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
తాజాగా ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ (RRR Documentary Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ డాక్యుమెంటరీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఈ చిత్రం కోసం తారక్ (NTR), రాంచరణ్, జక్కన్న అండ్ టీం ఎంతలా కష్టపడిందో చూపించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి 2021లో విడుదలైన ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.