
Mana Enadu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం ప్రజాసేవలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే తన పదవీ బాధ్యతల్లో నిమగ్నం కావడంతో ఆయన ప్రస్తుతం సినిమా షూటింగుకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ (OG Updates), ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ ఏం రావడం లేదు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
త్వరలోనే హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పాట జనవరి 1వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. అయితే కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్వరలో రిలీజ్ కానున్న పాటను ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడారట. అందుకే న్యూ ఇయర్ కానుకగా అభిమానుల కోసం ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది.
The Warrior Outlaw ~ #HariHaraVeeraMallu storms the theatres on MARCH 28th, 2025.💥⚔️🔥 pic.twitter.com/oFmSsohNcJ
— Hari Hara Veera Mallu (@HHVMFilm) November 23, 2024
ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. పవన్ కల్యాణ్ డేట్స్ (Pawan Kalyan Movies) ఇవ్వడంలో ఆలస్యం కావడంతో ఆయన దర్శకత్వం నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తీసుకున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా నుంచి జనవరి 1న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 2025 మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.