‘రామ్‌ చరణ్’ కటౌట్‌ వరల్డ్ రికార్డు.. హెలికాప్టర్​తో పూల వర్షం

Mana Enadu :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ముందుకు రానున్నాడు. జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇటీవలే డల్లాస్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్న చెర్రీకి ఈ చిత్రంతో సూపర్ హిట్ అవ్వాలని విజయవాడ ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

256 అడుగుల భారీ కటౌట్

విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కటౌట్ (Ram Charan Cutout) ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 256 అడుగుల కటౌట్ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ మూవీ ప్రొడ్యూసర్  దిల్ రాజు.. సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డు అందుకున్నారు. ఈరోజు సాయంత్రం కటౌట్ ఆవిష్కరించి.. హెలికాప్టర్ ద్వారా కటౌట్​పై పూలు వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్

రామ్​చరణ్ సినిమాల విషయానికొస్తే దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్​’ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో మరో చిత్రానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేయనుంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీలో చెర్రీ సరసన కియారా అడ్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఇప్పటికే ఈ కాంబోలో వినయ విధేయ రామ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *