Allu Arjun Bail Petition: నేడు బన్నీ బెయిల్ పిటిషన్‌పై కీలక తీర్పు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బెయిల్ పిటిషన్‌(Bail Petition)పై ఇవాళ నాంపల్లి కోర్టు(Nampally Court)లో విచారణ జరగనుంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో త‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్(Regular Bail) ఇవ్వాల‌ని బ‌న్నీ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీపై పోలీసులు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరిన నేపథ్యంలో విచారణను కోర్టుకు ఈరోజుకు వాయిదా పడింది.

ఇక సంధ్య థియేటర్‌(Sandya Theatre)లో తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌న్నీని ఇటీవ‌ల పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆయ‌న‌కు హైకోర్టు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్(Interim bail) ఇవ్వ‌డంతో విడుద‌ల‌య్యారు. మ‌రోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన‌ 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బన్నీ బెయిల్‌పై నేడు కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది.

బన్నీపై కేసు మొదలైందిలా..

కాగా డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో(Pushpa-2 Benefit Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. 2రోజులకు అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. దీంతో బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్‌ను 2వారాల పాటు రిమాండ్‌కు పంపింది. అయితే అప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేసిన అల్లు అర్జున్.. నాంపల్లి కోర్టు రిమాండ్ నేపథ్యంలో హైకోర్టును మధ్యంతర బెయిల్ కోరారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *