బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో ఇవాళ ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే రోహిత్, రాహుల్, కోహ్లీ వికెట్లను కోల్పోయింది. మరో ఎండ్‌లో ఓపెనర్ జైస్వాల్ (84) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. పంత్ (30) రన్స్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్ చెరో 3 వికెట్లు తీయగా, లయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా 2-1తో ముందంజలో ఉంది.
#Australia beat #TeamIndia
4th #Melbourne Test by 184 Runs#AUS – 474 & 234#IND – 369 & 155Player of the Match – #PatCummins (49 & 41, 3/89 & 3/28)#INDvsAUS #INDvAUS #AUSvIND #AUSvsIND #BoxingDayTest #MCGTest #MelbourneCricketGround#IndianCricketTeam #BorderGavaskarTrophy pic.twitter.com/0WDfw4L2cG
— Nishant Dravid (@nishantdravid73) December 30, 2024
WTC ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేయగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 105 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం నిలవగా టీమ్ఇండియా 155 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత్ WTC ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. భారత్ WTC ఫైనల్ చేరుకోవాలంటే కేవలం ఒకే ఒక దారి ఉంది. సిడ్నీ(Sydney) వేదికగా జనవరి 3 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ తప్పకగెలవాలి.








