Mana Enadu : రాజస్థాన్ జయపురలోని ఓ థియేటర్ లో పుష్ప-2 (Pushpa 2) సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెళ్లారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్ర టికెట్లను కొనుగోలు చేశారు. కొందరు ఆన్ లైన్ లో ముందే బుక్ చేసుకోగా.. మరికొందరు థియేటర్ వద్ద కొనుగోలు చేశారు. ఇక కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, సమోసా లాంటి వాటిని తీసుకుని హాయిగా సినిమా ఎంజాయ్ చేద్దామని హాల్ లోకి వెళ్లారు. స్క్రీన్ పై మూవీ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వారు పుష్ప-2 సినిమా టికెట్లు కొని వెళ్తే అక్కడి థియేటర్ లో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా స్క్రీనింగ్ వేశారు.
పుష్ప-2 కోసం వెళ్తే బేబీ జాన్ చూపించారు
ఇదే విషయంపై థియేటర్ యాజమాన్యాన్ని ఆరా తీయగా వారు బేబీ జాన్ (Baby John) సినిమాను చూడమని బలవంతం చేశారట. తాము టికెట్ బుక్ చేసుకుంది ‘పుష్ప 2’ సినిమా కోసం అని, బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని ప్రేక్షకులు హాలులోనే హంగామా చేశారు. ముందస్తు సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయినా స్క్రీనింగ్ చేయకపోవడంతో చేసేదేం లేక కొందరు సినిమా చూస్తే, మరికొందరు మాత్రం రీఫండ్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#jaipur:- राज मंदिर सिनेमा में हंगामा,
मूवी की ऑनलाइन टिकट लेकर आज सुबह पहुंचे थे लोग,सिनेमा हॉल के प्रबंधन ने चेंज कर दी मूवी,ऐसे में राज मंदिर के बाहर जमकर हो रहा हंगामा #Pushpa2TheRule #Rajmandir #Pushpa2 pic.twitter.com/ombZmIMdtK
— अल्हड़ पत्रकार (@Rajesh__Jamaal) December 25, 2024
హిందీ హిస్టరీలో బ్లాక్ బస్టర్ వసూళ్లు
‘పుష్ప-2’ సినిమాకు నార్త్‌లో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా రిలీజై 25 రోజులు అవుతున్నా హిందీలో పుష్ప రాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా హిందీలో ఇప్పటికే రూ.700 కోట్ల వసూళ్లు (Pushpa 2 Hindi Collections) సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హిందీ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. హిందీలో భారీ నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.






