కొత్త ఏడాది వేళ..చింతకాని SI స్ట్రాంగ్​ వార్నింగ్​ ఎవరికంటే..?

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా సంబురాలు చేసుకోవాలని చింతకాని సబ్​ ఇన్​స్పెక్టర్​ షేక్​ నాగుల్​మీరా సూచించారు. ముందుస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలిపారు. నేటి సాయంత్రం ఐదు గంటల నుంచే మండల వ్యాప్తంగా పోలీస్​ పహారా ఉంటుందన్నారు.

బహిరంగంగా వేడుకలు నిర్వాహించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు.144 సెక్షన్​ అమలులో ఉందని ఐదుగురు, అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం చేయద్దొన్నారు.

యువత గుంపులుగా చేరి రోడ్లపై కేకలు వేస్తూ అల్లరి చేయడంతోపాటు వాహనాలపై తిరగడం మండలంలో పూర్తిగా నిషేదమని ప్రకటించారు.‌అనవసరంగా నూతన సంవత్సర వేళ కొత్త చిక్కులు కొని తెచ్చుకోకండని చెప్పారు.
అల్లర్లకు పాల్పడితే అస్సలు ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరిమూకలను హెచ్చరించారు.

Related Posts

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…

Thunderstorm: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. 8 మంది మృతి 

ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *