సంక్రాంతి బరిలో బిగ్ మూవీస్.. టికెట్ రేట్స్ ఇవే!

ఈసారి సినీ ఇండస్ట్రీలో పొంగల్‌(Sankranti)కి పోటీ మామూలుగా లేదు. ముగ్గురు అగ్రహీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నువ్వానేనా అన్నట్లు పోటీ పడబోతున్నాయి. రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’, నటసింహం బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్(Daku Maharaj), ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేశ్-అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాతికి వస్తున్నాం(Sankrantiki Vastunnam)’ మూవీలు పొంగల్(Pongal) బరిలో నిలిచాయి. ఇందులో గేమ్ ఛేంజర్ జనవరి 10న, డాకు మహారాజ్ 12న, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి రానున్నాయి. అయితే సినిమాల ఫలితాలు పక్కన పెడితే భారీగా వసూళ్లు(Collections) రాబట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా సినిమాల టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దామా..

ఏపీలో గ్రీన్ సిగ్నల్

ఈసారి నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపు లేదు. కానీ APలో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్(Single screen) థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌(Multiplex)లో రూ.175ల టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. లిమిటెడ్ బెనిఫిట్ షో(Limited Benefit Shows)లకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను రూ.600 గా నిర్ణయించింది. దీంతో ఈ మూవీ మేకర్స్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది.

తెలంగాణలో వారికి నష్టమే!

ఇక బాలయ్య డాకు మహారాజ్ మూవీకి APలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.110, మల్టీప్లెక్స్‌‌ల్లో రూ.135 లు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు ఉన్నాయి. వీటికి మాత్రం రూ.500 పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. TGలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపున(Increase in ticket rates)కు అవకాశం లేకపోవడంతో ఇక్కడ నిర్మాతలకు, ముఖ్యంగా ఇక్కడ థియేట్రికల్ రైట్స్(Theatrical Rights) కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *