టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్(Choreographer cum Dancer) శేఖర్ మాస్టర్(Shekhar Master) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వెళ్లాడు. కొందరు హీరోలకు ఆయన ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో శేఖర్ మాస్టర్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్. సినిమాలతో పాటు బుల్లితెరపైనా పలు షోలకు జడ్జీగా చేస్తూ రెండు చోట్లా తన మార్క్ చూపిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ యాంకర్లు, కంటెస్టెంట్స్‌పై జోకులు వేయడం, పంచ్‌లు విసరడంలో ముందుంటారు. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై నెటిజన్లు(Netizens) మండిపడుతున్నారు.
Ee Song Okka Song Sankranthi Family Ladies ni Dhuram Chesav Kadha ra Chetha Na koda Shekar Master A Huge Disaster Loading aslu Ee Step moniter lo chusukoni ela OK Chesarraa#DaakuMaharaajOnJan12th#DabidiDibidi#DaakuMaharaajTrailer @vamsi84 pic.twitter.com/JBcwiLmKxD
— Narender Reddy Fan of NTR (@Narende62585399) January 2, 2025
సీనియర్ కొరియోగ్రఫర్ అయుండి ఇలా చేశారేంటి?
తాజాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మూవీ ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’. నందమూరి బాలకృష్ణ (Balakrishna) డైరెక్టర్ బాబీ కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ‘దబిడి దిబిడి’ అనే పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా(Urvashi Rautela)తో కలిసి వేశారు. అయితే ఈ స్టెప్పులపై నెటిజన్లు మండిపడుతున్నారు. “అసలు ఏంటి ఈ కొరియోగ్రఫీ? ఎవరు చేశారు?” అని ఫైర్ అవుతున్నారు. మరికొందరు “తాము చూసిన డ్యాన్సు స్టెప్పుల్లో ఇదే అత్యంత చెత్త కొరియోగ్రఫీ అని, కొందరు అసభ్యకరంగా, డబుల్ మీనింగ్ వచ్చేలా స్టెప్పులు ఉన్నాయని” అంటున్నారు. “సీనియర్ కొరియోగ్రఫర్ అయుండి ఇలా ఎలా చేశారంటూ” మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Mental Patient doesn't know what's right or wrong???
Shekar master should take responsibility for these vulgar steps #DaakuMaharaajOnJan12th #DakuMaharaj pic.twitter.com/fIg8GHVTFl— Aristotle (@goLoko77) January 2, 2025
సంక్రాంతి కానుకగా విడుదల
కాగా ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.






