గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ట్రైలర్ తో మరింత ఎక్కువయ్యాయి. శంకర్-రామ్ చరణ్ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతోందంటూ నెటిజన్లు అంటున్నారు. ఇక ట్రైలర్ రామ్ చరణ్ (Ram Charan) లుక్స్, ఆయన పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు ఫ్యాన్స్. చెర్రీని శంకర్ చూపించిన తీరు, యాక్షన్ సీక్వెన్స్, మేకింగ్ చూసి చెర్రీకి మరో హిట్టు పక్కా అని ఫిక్స్ అయ్యారు.
180 మిలియన్ వ్యూస్
అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ (Game Changer Trailer)కు నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. పుష్ప-2, దేవర తమిళ ట్రైలర్ రికార్డులను గేమ్ ఛేంజర్ కేవలం 16 గంటల్లో బద్ధలు కొట్టింది. ఇక తెలుగు ట్రైలర్ కూడా 53 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో ఈ ట్రైలర్ గేమ్ ఛేంజర్‌కు ఇప్పటికే 180 మిలియన్లకు పైగా వ్యూస్ (Game Changer Trailer Release) వచ్చాయి. ఈ దెబ్బతో దేవర, పుష్ప 2 ట్రైలర్ రికార్డులు బద్దలు కొట్టినట్టయింది. ట్రైలర్‌కు 180 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిందంటూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
180 Million💥
Stupendous. Like no other, like never before!🔥
The most talked about, the #GameChangerTrailer✨
🔗 https://t.co/aVIW0HqfLl#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/CyRnwGxj6R
— Sri Venkateswara Creations (@SVC_official) January 4, 2025
జనవరి 10న రిలీజ్
ఈ పోస్టర్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. చెర్రీ గుర్రంపై స్వారీ చేయడం ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఇక ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. మూవీ ఓపెనింగ్స్ కూడా భారీగా ఉండనున్నట్లు టాక్. ఇక ఇవాళ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. చెర్రీ సరసన ఇందులో కియారా అడ్వాణీ (Kiara Advani) నటించనుంది.






