ఇటీవల బాలీవుడ్ పై కామెంట్స్ చేస్తూ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు బీటౌన్ ప్రముఖులు వంశీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదం వేళ సినీ ప్రియులను ఉద్దేశించి నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలంటూ అందులో రిక్వెస్ట్ చేశారు. అయితే ఇది బోనీ కపూర్ (Boney Kapoor) తో వివాదం గురించి మాత్రం కాదండోయ్. మరి దేని గురించి అంటే..?
జనవరి 12న డాకు మహారాజ్
నాగవంశీ నిర్మాతగా.. బాబీ కొల్లీ దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు, యానిమల్ ఫేం బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. జనవరి 12వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.
నాకు మీ సపోర్ట్ అవసరం
ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi Tweet) ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమాను అతి పెద్ద బ్లాక్ బస్టర్ చేసేందుకు ప్రయత్నిద్దాం’’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే బోనీ కపూర్, బాలీవుడ్ తో వివాదం వేళ ఆయన ఈ పోస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే బీ టౌన్ తో వివాదం ప్రభావం తన సినిమాపై పడుతుందన్న అనుమానంతో ఆయన ఈ పోస్టు చేసి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం.
అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.
మీ
Naga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025
సమరసింహారెడ్డి ఫైట్ తరహా ఎపిసోడ్
మరోవైపు డాకు మహారాజ్ సినిమా గురించి మాట్లాడుతూ నాగవంశీ చిత్రంపై అంచనాలు పెంచేశారు. ఈ మూవీలో సెకండాఫ్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది ‘సమర సింహారెడ్డి (SamaraSimha Reddy)’ ఫైట్ తరహా ఎపిసోడ్లా ఉంటుందని చెప్పారు. బాలయ్య అభిమానులు ఆ సీన్ ను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇక ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తాము పూర్తి నమ్మకంతో ఉన్నామని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో నాగవంశీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.






