బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భాగంగా సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా(Team India) 157 పరుగులకు ఆలౌట్ అయింది. 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 16 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 రన్స్ లీడ్ కలుపుకొని ఆతిథ్య ఆసీస్‌కు 162 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. భారత ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్(Pant) 61 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, జడేజా 13, సుందర్ 12 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. కమిన్స్ 3 వికెట్లు, వెబ్‌స్టర్ ఒక వికెట్ తీశాడు.
బుమ్రా బౌలింగ్‌కి వచ్చేనా..?
ఇక 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా(Australia) దాటిగా ఆడుతోంది. మూడు ఓవర్లలోనే 35 రన్స్ చేసింది. క్రీజులో కొన్‌స్టాస్ (18) ఉన్నంతసేపు బౌండరీల వరద పారించాడు. ఇదే క్రమంలో మరో భారీ షాట్‌కు యత్నించి ప్రసిద్ధ్(Prasiddh Krishna) బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లబుషేన్(6), స్టీవ్ స్మిత్ (4)ను కూడా ప్రసిద్ధ్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం లంచ్ విరామానికి ఉస్మాన్ ఖవాజా (19), హెడ్(5) క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 రన్స్ కావాల్సి ఉండగా… టీమ్ఇండియా గెలవాంటే మరో 7 వికెట్లు పడగొట్టాల్సింది ఉంది. అయితే గాయం కారణంగా బుమ్రా(Bumrah) లేకపోవడంతో భారత బౌలింగ్ కాస్త వీక్(Weak)గా కనిపిస్తోంది.
Steve Smith dismissed on 9,999 Test runs.
– Prasidh Krishna on fire with 3 wickets 🔥#INDvsAUSTest pic.twitter.com/3zU2OKPl5t
— Richard Kettleborough (@RichKettle07) January 5, 2025






