గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.
పవన్ కల్యాణ్ రూ.10 లక్షల ఆర్థికసాయం
‘‘గత ఐదేళ్లలో కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డును ఎవరూ పట్టించుకోకపోవడంతో అది పాడై ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు మరమ్మతుల పనుల్లో ఉంది. అయితే ఈ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి చాలా బాధగా ఉంది. జనసేన పార్టీ (Janasena Party) తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. అని పవన్ కల్యాణ్ (Pawan kalyan) తెలిపారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025
దిల్ రాజు రూ.10 లక్షల సాయం
మరోవైపు, ఈ ఘటనపై చిత్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినిమా ఈవెంట్ల నుంచి వెళ్లేటప్పుడు అభిమానులు చాలా అప్రత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 10వ తేదీన గేమ్ ఛేందర్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Producer Dil Raju has announced an exgratia of 5 lakhs each to two fans who died in a road accident while returning from the pre-release event of #GameChanger in Rajamahendravaram. pic.twitter.com/3dhkafQnaU
— Bhacho (@Bhacho4JSP) January 6, 2025







