బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన మూవీ ‘ఎమర్జెన్సీ (Emergency Trailer)’. ఆమె స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఎమర్జెన్సీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు సినిమాపై మరింత అంచనాను పెంచేసింది.
ఇందిరా పాత్రలో ఒదిగిన కంగన
ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగన రనౌత్ (Kangana Ranauth) ఒదిగిపోయింది. తన నటన, హావభావాలతో అచ్చం ఇందిరను తట్టుకుంది. ఇక ఆహార్యం కూడా ఇందిరా గాంధీని తలపించేలా ఉంది. డైలాగ్ డెలివరీ అయితే కరెక్టుగా యాప్ట్ అయింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో లీనమైంది కంగనా. ఇక ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ సహా మరికొందరు నటులు కీలక పాత్రలు పోషించారు.
ఇందిరనే ఇండియా.. ఇండియానే ఇందిర
“గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు.. మీరిప్పుడు సింహాసనంపై కూర్చొని కాదు.. ఓ సింహంపైన కూర్చొని సవారీ చేస్తున్నారు.ఈ సింహగర్జన ప్రపంచమంతా వినిపిస్తుంది. ఈరోజూ ఈ సింహం భారతదేశ స్వతంత్రాన్ని మింగేసింది. ఏదో ఓరోజు ఈ సింహం మిమ్మల్నీ తినేసేలా ఉంది… ఈ అంశంలో పూర్తి కేబినెట్ అనుమతి అవసరం ఇందిరా గారు.. నేనే కేబినెట్ ను రాష్ట్రపతి జీ.. ఇది ఓ ఇంధ్రప్రస్థం.. నేను కౌరవులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నా… India is Indira and Indira is India” అనే డైలాగులు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.






