Kanguva : ఆస్కార్‌ బరిలో అట్టర్ ఫ్లాప్ సినిమా

గతేడాది కోలీవుడ్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ‘కంగువా (Kanguva)’ చిత్రం. సూర్య (Suriya) హీరోగా.. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రంగా విఫలమైంది. ఫలితంగా సూర్య తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవాల్సి వచ్చింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన కంగువా.. విడుదలైన ప్రతి భాషలో ఫ్లాప్ గానే మిగిలింది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది.

ఆస్కార్ రేసులో డిజాస్టర్ మూవీ

కానీ ఇప్పుడు కంగువా సినిమా భారతదేశం గర్వించే దిశగా దూసుకెళ్తోంది. కలెక్షన్లు, టాక్ పరంగా డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న కంగువా సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసు (Oscar Race 2025)లో నిలిచింది. 2025 వ ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో 207 సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి. అందులో భారతదేశానికి చెందిన మూడు సినిమాలున్నాయి. ఆ లిస్టులో కంగువా మూవీ ఉత్తమ చిత్రం (Kanguva in Oscar Best Movie Category) విభాగంలో పోటీ పడుతోంది.

ఇండియా నుంచి ఆ మూడు చిత్రాలు

ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా  ‘ఆడు జీవితం (Aadujeevitham)’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘సంతోష్ స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ (Santosh Swatantrya Veer Savarkar)’  కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచిన విషయం తెలిసిందే. కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం  సంపాదించ లేక వెనుతిరిగింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *