ఈ సంక్రాంతి పండుగకు విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. జనవరి 14వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మొదటి నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో జోరు చూపిస్తూ వచ్చిన ఈ చిత్రబృందం ఈ సంక్రాంతికి మరింత ఫన్ పంచేందుకు రెడీ అయింది.
రానా షోలో వెంకటేశ్
వెంకటేశ్ (Venkatesh), ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఏడాది రేసులో సూపర్ హిట్ అవ్వాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. ఈ సినిమాతో వెంకీ-అనిల్ కాంబో హ్యాట్రిక్ కన్ఫామ్ అంటూ ప్రమోషన్స్ లో జోరు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రేక్షకుల్లోకి తమ చిత్రాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఈ చిత్రబృందం పండుగ వేళ డబుల్ ఫన్ పండించేందుకు వచ్చేస్తోంది.
సంక్రాంతికి డబుల్ ఫన్
ఇందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ‘రానా దగ్గుబాటి షో (The Rana Daggubati Show)’లో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ సందడి చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటులు వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షి ఈ షోకు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ శనివారం రోజున ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ ఎపిసోడ్ లో వెంకీ, రానా చాలా ఫన్నీగా ముచ్చటించారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. సంక్రాంతి పండుగ వేళ రానా దగ్గుబాటి వెంకటేష్ స్పెషల్ ఎపిసోడ్ డబుల్ ఫన్ పంచుతుందంటున్నారు.
Sankranti’s best served with Victory V🪁 #TheRanaDaggubatiShowOnPrime, new episode every Saturday
@SpiritMediaIN @VenkyMama @Meenakshiioffl @AnilRavipudi @aishu_dil @RamanaGogula pic.twitter.com/5ZLErhdW8m
— Rana Daggubati (@RanaDaggubati) January 8, 2025






