Pushpa2: రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ వాయిదా.. ఎందుకో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2(Pushpa-2) నుంచి సినిమాను సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 11న పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్‌(reloaded version)ను తీసుకొస్తున్నట్లు మంగళవారం మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిని మరో తేదికి పోస్ట్ పోన్(postponed) చేస్తున్నట్లు బుధవారం మేకర్స్ ట్విటర్ (X) వేదికగా అధికారికంగా ప్రకటించారు. టెక్నికల్ కారణాల(Technical reasons)తో మూవీని అనుకున్న సమయానికి తీసుకురాలేకపోతున్నామని తెలిపారు. ప్రస్తుత మూవీ రన్ టైంకి మరో 20 నిమిషాలు కలిపే ప్రాసెస్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. అందుకోసం జనవరి 17న విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది.

మొత్తం 3 గంటల 40 నిమిషాలు

కాగా ఈ మేరకు ‘‘సంక్రాంతి కానుకగా పుష్ప-2 రీలోడెడ్.. వైల్డ్ ఫైర్(Reloaded.. Wild Fire) ఇప్పుడు మరింత ఫైరీగా ఉండబోతోంది’’ అని మైత్రి మూవీ మేకర్స్ నిన్న ట్వీట్(Tweet) చేశారు. ఇదిలా ఉండగా.. ప్రజెంట్ పుష్ప-2 రన్ టైం 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్ కాగా.. తాజాగా మరో 20 నిమిషాలు కలపనున్నారు. దీంతో మొత్తం 3 గంటల 40 నిమిషాలకుపైగా నిడివి ఉండనుంది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 4 గంటలు అన్నమాట. దీంతో ఈ మూవీ కలెక్షన్స్(Collections) ఇంకా పెరిగే అవకాశం ఉంది.

మరో రూ.170 కోట్లు వసూలు చేస్తే..

డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా.. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘Baahubali 2’ రికార్డు కూడా బద్దలు కొట్టిన ఈ మూవీ మరో రూ.170 కోట్లు వసూలు చేస్తే రూ.2000 కోట్ల క్లబ్‌లో ఈ మూవీ చేరనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *