అమెరికా బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తెలుగు వారికి సుపరిచతమే. ఈ భామ తాజాగా సినిమాటోగ్రాఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ‘బూమరాంగ్ (Boomerang)’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపించింది. ఈ మూవీలో శివ కందుకూరి ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నాడు.
షాక్ లో అను
ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో చీకట్లో ఉన్న ఓ ఇంటి ముందు డెడ్‌బాడీలు పడి కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో నుంచి ఓ వ్యక్తి కుక్కను పట్టుకుని రావడం కనిపిస్తోంది. ఇక మరోవైపు అనూ ఇమ్మాన్యుయేల్ ఈ పోస్టరులో చాలా షాక్ కు గురైనట్లుగా కనిపించడం చూడొచ్చు. ఈసారి ఈ బ్యూటీ ఏదో సస్పెన్స్ స్టోరీతో పక్కా హిట్ కొట్టేందుకు వచ్చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాతో ఆండ్రీవ్ బాబు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.
Presenting the thrilling title & first look of #BigMovieMakers and @My3Arts Production No. 1 ~ 𝘽𝙊𝙊𝙈𝙀𝙍𝘼𝙉𝙂 💥
⭐️ing @ItsAnuEmmanuel, @iam_shiva9696
Directed by @iandrewdop
Music by @anuprubens
Produced by @Londonganesh & @DrVootla98317@harshachemudu #SitharaFilmsLtd pic.twitter.com/hXsd2EvgWe— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2025
కర్మ ఈజ్ ఏ బూమరాంగ్
యూనిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో శివ కందుకూరి (Shiva Kandukuri), అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు.. వెన్నెల కిశోర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తోంది. రెండు స్టోరీ లైన్స్ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. లండన్‌లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చెప్పారు.
ఈ సినిమా కలిసొచ్చేనా
ఇక అనూ ఇమ్మాన్యుయేల్ నాని నటించిన ‘మజ్ను (Majnu)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత గోపీచంద్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ బ్యూటీ రవితేజతో కలిసి నటించిన రావణాసుర, కార్తీతో నటించిన జపాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఆశలన్నీ బూమరాంగ్ పైనే పెట్టుకుంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.






