టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి చాలా స్పెషల్ (Sankranti Movies). ఏడాది ప్రారంభంలో వచ్చే పండుగ రోజున హిట్టు కొడితే వచ్చే మజాయే వేరు. అందుకే చాలా మంది నటులు సంక్రాంతికి తమ చిత్రాలు రిలీజ్ చేయాలనుకుంటారు. ఇక పండుగ వేళ ఇంటిల్లిపాది ఒకే చోట ఉంటారు కాబట్టి అందరూ కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుంది. అందుకే సంక్రాంతి పండుగ ఇటు తెలుగు ప్రజలకు.. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకం. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.
ఆ ముగ్గురికి చాలా అవసరం
అందులో మొదటగా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ వస్తోంది. జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. శంకర్ డైరెక్షన్ లో కియారా అడ్వాణీ ఫీ మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా.. ఫట్ అవుతుంతా అని తెలియాలంటే మరో 24 గంటలు వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఫలితం ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల కెరీర్ కు కీలకంగా మారనుంది. వారెవరంటే..?
Racing towards the release, with the game face on! 🔥#GameChanger arrives in theatres on 10th Jan💥
Book your tickets now ✨
🔗 https://t.co/mj1jhGZaZ6#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/EbsLEEeAWj
— Game Changer (@GameChangerOffl) January 8, 2025
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్
తమిళ డైరెక్టర్ శంకర్ (Director Shankar)కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు లార్జర్ దెన్ లైఫ్ లా ఉంటాయనే ఇమేజ్ ఉంది. శంకర్ చిత్రం అంటే ప్రతి ప్రేక్షకుడికి ఆసక్తి ఉంటుంది. జెంటిల్మెన్ సినిమా నుంచి.. భారతీయుడు, రోబో, స్నేహితుడు, శివాజీ, ఐ, రోబో 2.ఓ ఇలా ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇటీవల ఆయన తీసిన ఇండియన్-2 మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా హిట్ అవ్వడం ఆయనకు చాలా అవసరం.
చెర్రీ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
‘RRR’లో రామరాజుగా అద్భుతమైన నటనతో అలరించాడు రామ్‌చరణ్ (Ram Charan). ఆ సినిమాతో ఒక్కసారిగా ఆయన రేంజ్ హాలీవుడ్ కు పాకింది. మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత చెర్రీ తన తండ్రి మెగాస్టార్ తో కిలసి ‘ఆచార్య’లో నటించాడు. ఆ సినిమా ఇద్దరీకి చేదు అనుభవాన్నే ఇచ్చింది. అందుకే ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ తో వస్తున్న చెర్రీకి ఈ సినిమా హిట్ కావడం చాలా అసరం. ఓ సూపర్ హిట్ తర్వాత చిత్రం ఫ్లాప్ అవ్వడం సెంటిమెంట్ గా వస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అవుతాడా? చూడాలి.
దిల్ రాజు పాస్ అవుతాడా..?
గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అవ్వడం హీరో, డైరెక్టర్ కంటే నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు చాలా అవసరం ఇప్పుడు. ఈ సినిమా కోసం ఆయన భారీ బడ్జెట్ పెట్టారు. ‘‘ఇది నా కమ్ బ్యాక్ ఫిల్మ్. ప్రేక్షకులు విజిల్స్ వేసే సీన్స్ ఎన్నో ఉన్నాయి’’ అంటూ దిల్ రాజు చెబుతున్నా ఈ సినిమాకు ఇస్తున్న హైప్ చూసి.. ఎక్కడో తేడా కొట్టేలా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దిల్ రాజు మాత్రం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన ఖాతాలో హిట్ పడి చాలా రోజులైంది. నాగచైతన్య ‘థ్యాంక్యూ’, విజయ్.. ‘వారిసు’, సమంత.. ‘శాకుంతలం’, విజయ్ దేవరకొండ.. ‘ది ఫ్యామిలీస్టార్’.. ఇలా వరుసగా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’ హిట్ అవ్వడం ఇప్పుడు దిల్‌రాజుకు ముఖ్యం. మరి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఈ ముగ్గురు నిజమైన ‘గేమ్ ఛేంజర్’లు అవుతారా? లేదా? వేచి చూడాలి.






