నిత్యా మేనన్(Nithya Menon).. సహజ నటన(Natural acting)తో.. గ్లామర్ డోస్‌కు ఆమడ దూరం ఉంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కథ ఎంపికలోనూ.. పాత్రల సెలక్షన్‌లో తనదైన గుర్తింపు చాటుతూ ఇండస్ట్రీ(Industry)లో పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. పుట్టింది కర్ణాటక(Karnataka)లో అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన సినిమాలకు తానే వాయిస్ కూడా ఇచ్చుకుంది. ఆనాడు గ్లామర్ పాత్రలు, డ్రెస్సింగ్ విషయాల్లో సౌందర్య ఎలా ఉండేదో.. అచ్చం అలాంటి పద్ధతులను పాటిస్తూ సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకుంటోందీ బామ. ప్రస్తుతం సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అసలు సినిమాలే చేయనంటోంది. ఇంతకీ అసలు మ్యాటరేంటో తెలుసుకుందామా..
అనుకోకుండా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్నాను..
నిత్యా మేనన్ నటించిన లేటెస్ట్ కోలీవుడ్ చిత్రం ‘కాదలిక్క నెరమిళ్లై(Kadalikka Neramillai)’. ఈ చిత్ర ప్రమోషన్స్(Promotions)లో భాగంగా నిత్యా మేనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “పాడటం, డ్యాన్స్(Dance) చేయడం, యాక్టింగ్ చేయడం ఇవన్నీ చిన్ననాటి నుంచే మా అమ్మ నాతో చేయించింది. నిజం చెప్పాలంటే, నాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్నాను. ప్రతి సారి సినిమాలు వదిలేయాలని అనుకున్నప్పుడు ఏదో ఒకటి అడ్డంకిగా మారింది. సినిమాలు మానేస్తానని అనుకున్న సమయంలోనే ‘తిరుచిత్రంపళం(Tiruchitapalam)’ చిత్రానికి జాతీయ అవార్డు(National Award) వచ్చింది. అప్పుడే నాకు ఒక విషయం స్పష్టమైంది. నేను సినిమాలు మానేస్తే, సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టదు’ అని చెప్పింది.
పైలట్ అవ్వాలని చిన్ననాటి నుంచి కల
‘‘ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను. నాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయటకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. పార్కులో నడవాలని అనిపించినా, అది సాధ్యం కాదు. ట్రావెలింగ్(Traveling) అంటే నాకు ఎంతో ఇష్టం. పైలట్(Pilot) అవ్వాలని చిన్ననాటి నుంచి కల. ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి’’ అని ఈ కన్నడ బొద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.






