ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఇక పూర్తి వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న తొలి పాడ్ కాస్ట్ ఇదే కావడం గమనార్హం. ఇంతకీ మోదీని ఇంటర్వ్యూ చేసింది ఎవరంటే..? ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath). ఆయన నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో మోదీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.
ఇదే నా తొలి పాడ్ కాస్ట్
రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో (PM Modi Podcast) రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఈ ఇద్దరు ముచ్చటించినట్లు తెలుస్తోంది. పాడ్ కాస్ట్ ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. ‘ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒకింత భయంగా ఉంది’ అని అనగా.. ‘ఇదే నా తొలి పాడ్‌కాస్ట్(nikhil kamath podcast). దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి’ అని మోదీ అనడంతో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నేను భగవంతుడిని కాదు కదా
రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటీ? అని నిఖిల్ కామత్ (Nikhil Kamath) ప్రధానిని ప్రశ్నించారు. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజాసేవ చేయాలన్న మిషన్ తీసుకోవడం కోసం రావాలని.. సొంత లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం కాదని ఆయన సమాధానమిచ్చారు. ఇక మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పాత ప్రసంగాల గురించి మాట్లాడారు. ‘‘అప్పుడు నేనే ఏదో అని ఉంటాను. పొరపాట్లు జరుగుతుంటాయి. నేనూ మనిషినే.. భగవంతుడిని కాదు కదా..!’’ అని అన్నారు.
I hope you all enjoy this as much as we enjoyed creating it for you! https://t.co/xth1Vixohn
— Narendra Modi (@narendramodi) January 9, 2025






