గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో ఇవాళ (జనవరి 10) రిలీజ్ అయిన చిత్రం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో అభిమానులు ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ(Kiara Advani)నటించగా.. సీనియర్ హీరోయిన్ అంజలీ(Anjali) కీలక పాత్ర పోషించిది. దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా వ్యవహరించగా.. తమన్(Thaman) మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే మూవీ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే దాదాపు 4 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన రామ్ చరణ్‌కు షాకిచ్చారు పైరసీదారులు. ఇంతకీ విషయమేంటంటే..
నిజంగా హార్ట్ బ్రేకింగ్: సినీ వర్గాలు
రామ్ చరణ్ RRR తర్వాత సోలో హీరోగా గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి రిలీజ్ వరకూ భారీ ఫ్యాన్ బజ్ చేసుకుంది. అదే ఊపులో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను పైరసీ ముఠా వెంటాడినట్లు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘ గేమ్ ఛేంజర్ HD ప్రింట్ లీక్డ్.. ఇట్ ఈజ్ షాక్డ్’’ అని Let’s X OTT GLOBAL అనే ట్వీటర్(X) ఖాతా నుంచి ట్వీట్ చేశారు. దీనిపై సినీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్(Makers) ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా ఇటీవల రోజుల్లో పైరసీ రక్కసీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
అందరి అంచనాలకు తగ్గట్టుగానే..
ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్(Director Shankar) ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలుకి ఏమాత్రం తీసి పోని విధంగా మూవీ ఉందని తెలుస్తోంది. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్టే ఆడియెన్స్‌ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెర వైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్‌తో క్రేజీ స్క్రీన్ ప్లేతో సినిమా పరుగులు పెట్టించాడు. అలాగే సినిమాలో ఎలివేషన్స్ గాని కొన్ని ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తాయి. చెర్రీ డ్యూయల్ రోల్ యాక్టింగ్, SJ సూర్య, అంజలి నటన, తమన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఫ్యాన్స్ అంటున్నారు.
HD LEAKED ! It is Shocking 💔
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 10, 2025






