ఊరెళ్తున్న భాగ్యనగరం.. పంతంగి టోల్ గేట్ వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ (Sankranti Festival 2025) దగ్గరికి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వృత్తి, ఉద్యోగం, విద్య వివిధ కారణాలతో సొంతూళ్లకు దూరంగా పట్టణాల్లో ఉన్న వారంతా పండుగకు ఊరెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్లంతా పల్లెలకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారుతున్నాయి.

పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి (Hyderabad Vijayawada High Way)పై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక టోల్ గేట్ సిబ్బంది 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని.. 6 గేట్ల ద్వారా హైదరాబాద్‌ వైపు వచ్చే వారిని పంపిస్తున్నారు.

కిక్కిరిసిన బస్టాండ్లు

మరోవైపు చౌటుప్పల్‌ కూడలిలో అండర్‌పాస్‌ నిర్మాణ పనుల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీస్‌ (MGBS), జేబీఎస్‌ (JBS), దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్లు, ఎల్బీ నగర్‌ కూడలి రద్దీగా మారాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *