ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది మన డార్లింగ్ ప్రభాస్ (Prabhas) పేరే. పాన్ ఇండియా స్టార్ గా పేరొంది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మన రెబల్ స్టార్. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉన్న మన డార్లింగ్.. పర్సనల్ లైఫ్ పై మాత్రం చాలా తక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. తమ డార్లింగ్ ఎప్పుడు ఓ ఇంటివాడవుతాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ కు పెళ్లి కుదిరింది
అయితే ప్రభాస్ (Prabhas Marriage) ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడే సమయం వచ్చేసింది. ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే ఆయన చేసుకోబోయే అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయింది. గోదారమ్మాయినే మన డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అంటూ ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి న్యూస్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చక్కర్లు కొట్టాయి. కాకపోతే ఈసారి కాస్త గట్టిగా ఈ వార్తలు షికారు చేస్తున్నాయి.
ఆ అమ్మాయే మన డార్లింగ్ బెటర్ హాఫ్
ఇక ఇవన్నీ నిజమేనంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా హింట్ ఇచ్చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెర్రీ.. బాలయ్య హోస్టు చేస్తున్న ‘అన్ స్టాపబుల్ (Unstoppable With NBK)’ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో చరణ్ ప్రభాస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకున్నాడు. ప్రభాస్ కోసం అమ్మాయిని వెతుకుతున్నారని.. ఆంధ్రప్రదేశ్లోని గణపవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని చెర్రీ చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయం ఎంత నిజమో తెలియాలంటే.. జనవరి 14 రిలీజ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ను చూడాల్సిందే.






