నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. స్టోరీ పాతదే అయినా.. బాలయ్య తన నటనతో మరోసారి మాస్ ఆడియెన్స్ కు కిక్ ఎక్కించాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి ఈ సినిమా రిలీజ్ అయింది.
డాకు సక్సెస్ పార్టీ
ఇక సంక్రాంతి (Sankranti) రేసులో వచ్చిన గేమ్ ఛేంజర్ తో పోటీ పడ్డ డాకు మహారాజ్ సక్సెస్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ సంబురాలు చేసుకుంది. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరోలు, బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. బాలయ్యతో కలిసి డాకు సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హీరోలతో బాలయ్య ముద్దులాట
ఈ వీడియోలో బాలయ్యతో సిద్ధు (siddhu jonnalagadda) , విశ్వక్ సరదాగా గడపడం కనిపిస్తోంది. ఇక బాలయ్య ఈ కుర్ర హీరోలను ముద్దులతో ముంచెత్తడం కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దులాట నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బాలయ్య చేసిన పని చూసి నందమూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మా బాలయ్యకు ప్రేమొస్తే తట్టుకోలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
#NandamuriBalakrishna kisses young heroes @VishwakSenActor and #SidhuJonnalagadda in the #DaakuMaharaaj success party. pic.twitter.com/G09FLe00Lv
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 12, 2025






