BCCI New Rule: భారత క్రికెటర్లకు షాక్.. ఇకపై సరిగ్గా ఆడకపోతే మనీ కట్!

భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ(Board of Control for Cricket in India) సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టీమ్ఇండియా(Team India) ప్రదర్శన చాలా పేలవంగా ఉంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై టెస్టు, శ్రీలంకపై ODI సిరీస్‌ను కోల్పోయింది. అయితే ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రీడాభిమానులు ఉన్నది మనదేశంలోనే.. అటు అన్ని క్రికెట్ బోర్డులలోనూ BCCIదే అప్పర్ హ్యాండ్. అలాంటిది జట్టు వరుస ఓటములు చవిచూస్తుంటే ఊరికే చూస్తూ ఉంటుందా? అందుకే బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్లేయర్ల పర్ఫార్మెన్స్(Performance of players) ఆధారంగా డబ్బు చెల్లించనున్నట్లు సమాచారం.

2019కి ముందు ఉన్న రూల్‌ మళ్లీ అమలు

ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌(Alert)గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి(pressure) పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. అలాగే విదేశీ ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో క‌లిసి ఎక్కువ కాలం ఉంటే అది వారి ప్ర‌ద‌ర్శ‌నపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తోంద‌ని BCCI భావిస్తోంద‌ట‌. అందువల్ల ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేస్తూ 2019కి ముందు ఉన్న రూల్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఇకపై ప్రతి ఆటగాడు జట్టులోని ఇతర సభ్యులతో కలిసి జట్టు బస్సులోనే ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

జట్టు పనితీరుపై విమర్శల నేపథ్యంలో

తాజా నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్‌(NZ)తో స్వదేశంలో, ఆస్ట్రేలియాతో జరిగిన BGT టెస్ట్ సిరీస్‌లను వరుసగా ఓడిపోయిన తర్వాత.. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir), అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డెస్కటేతో సహా అతని మద్దతు జట్టు పనితీరుపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీసీఐ సహాయక సిబ్బంది(Support staff) కాంట్రాక్టులను గరిష్ఠంగా మూడేళ్లుగా నిర్ణయించింది. విమాన ప్రయాణ సమయంలో 150 కిలోల బరువు దాటితే ఆటగాళ్ల లగేజీకి BCCI చెల్లించడం మానుకోవాలని భావిస్తోందని నివేదిక(Report) పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *