ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి T20లో భారత్(Team Indai) టాస్ గెలిచి ఫీల్డింగ్(Fielding) ఎంచుకుంది. కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో భారత్ తరఫున ఇద్దరు తెలుగు ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఆసీస్ టూర్‌లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar reddy), అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలు బాదిన తిలక్ వర్మ(Tilak Varma)కు జట్టులో చోటు దక్కింది. అయితే స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Shami)కి తుది జట్టులో ప్లేస్ లభించలేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించనట్లుగా తెలుస్తోంది. జట్ల వివరాలు ఇలా..
Team India
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
England
జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్(కీపర్), బెన్ డక్కెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెథెల్, ఓవర్టన్, పాట్ అట్కీన్‌సన్, జోఫ్రా అర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Ind vs Eng #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/3YXealA3OL
— Babalu Yadav (@BabaluY45787126) January 22, 2025






